శభాష్‌ సజ్జనార్.. లాభాలబాటలో ఆర్టీసీ?

Chakravarthi Kalyan
తెలంగాణ ఆర్టీసీకి ఈ ఏడాదిలో 4వేల కోట్ల రెవెన్యూ పెరిగింది. ఈ ఏడాదిలో 1300కోట్ల నష్టాన్ని తగ్గించినప్పటికీ ఇంకా 650కోట్ల నష్టాల్లో ఉంది. ఈ 2022సంవత్సరంలో ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా అభివృద్ది సాధించింది. వచ్చే ఏడాదిలో నష్టాన్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తామంటోంది. రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో20కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆ రోజు 12డిపోల్లో వందకు వందశాతం ఓఆర్ వచ్చింది.
సిటీలో బస్‌లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి మెట్రో కాంబినేషన్ టికెట్‌ను  20నుంచి 10రూపాయలకు తగ్గించింది. దీంతో చాలా మార్పు వచ్చింది. అలాగే ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ ఇవ్వాలని భావిస్తోంది. కార్మికుల మీద అధికారుల వేధింపులకు లేవని..వేధింపులు ఉంటే  ఇలాంటి రెవెన్యూ వచ్చేదేకాదు. తెలంగాణ ఆర్టీసీ సాధిస్తున్న ఈ ప్రగతికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విధానాలు కారణంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: