కుప్పంలో పోటీపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్‌?

Chakravarthi Kalyan
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన లేదని సినీ హీరో విశాల్ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీ చేస్తాననటం అంతా వదంతులేనన్నారు. తాను నటించిన లాఠీ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. తాను ఎక్కడుంటే అక్కడో వివాదం ఉంటుందని.. ఆ కోవలోనిదే కుప్పం నుంచి పోటీ చేసే అంశం అన్నారు. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉందన్నారు.
ప్రజలకు ఓ నటుడిగా శాసనసభ్యుడి కంటే ఎక్కువ సేవ చేస్తున్నానని… డబ్బులు ఎక్కువే సంపాదిస్తున్నానన్నారు. .. లాఠీ చిత్రం వసూళ్లలో ఒక్కో టికెట్ నుంచి ఒక రూపాయి చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. 45 రోజుల పాటు వచ్చిన కలెక్షన్ నుంచి ఆన్వదాతలకు ఆర్థిక సాయం చేస్తానన్నారు… వేడుకలో పాల్గొన్న విశాల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: