పార్లమెంట్‌లో షూటింగ్ చేస్తానంటున్న కంగనా?

Chakravarthi Kalyan
బాలీవుడ్  నటి కంగనా రనౌత్ ఏకంగా పార్లమెంట్‌లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. ఓ చారిత్రక సినిమా కోసం పార్లమెంట్‌లో షూటింగ్ చేయాలని ఆమె భావిస్తున్నారు. పార్లమెంట్ లో సినిమా చిత్రీకరణకు అనుమతి కోరుతూ బాలీవుడ్  హీరోయిన్ కంగనా రనౌత్  
లేఖ పంపినట్లు లోక్ సభ సచివాలయం వర్గాలు తెలిపాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా.. ఆ సినిమా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగుతుంది.

ఈ ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటిస్తోంది. ఈ జూన్ లోనే ప్రారంభమైన ఈ చిత్రానికి కంగనా దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథను బట్టి కొన్ని సన్నివేశాలు పార్లమెంట్ లోనే షూటింగ్ చేయాలని కంగనా రనౌత్ భావిస్తోంది. కానీ ఇప్పటివరకు పార్లమెంట్ లో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటి వరకూ దూరదర్శన్ , సంసద్  టీవీ షూటింగ్ లు, సభా కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంది. మరి బీజేపీ అనుకూల నటిగా పేరున్న కంగనా అభ్యర్థనను మన్నిస్తారా.. తిరస్కరిస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: