సీక్రెట్‌: రోజాకు మొదటి ఛాన్స్.. ఇలా వచ్చిందా?

Chakravarthi Kalyan
ఏపీ మంత్రి రోజా గతంలో హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆమే ప్రేమ తపస్సు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే.. తాజాగా ఆమె తనకు ఆ మొదటి అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి రోజా ఆ విషయం బయటపెట్టారు.

తాను తిరుపతిలోని పద్మావతి మహిళా.. విశ్వవిద్యాలయంలో జరిగిన యువజనోత్సవాలలో పాల్గొన్నాని రోజా గుర్తు చేసుకున్నారు. అప్పుడు తన ఫొటోలను నోటీస్ బోర్డులో పెట్టారని....వాటిని చూసిన ప్రేమ తపస్సు చిత్ర దర్శకులు ఆ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని రోజా అన్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న మీరు మీకు నచ్చిన రంగంలో రాణించాలని రోజా కోరారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న మీరు ప్రతిభను నిరూపించుకుంటే సినీ రంగంలో అవకాశాలుంటాయని రోజా అన్నారు. అదే సమయంలో చదువును నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి రోజా సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ  అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: