మునుగోడులో కేఏ పాల్.. ఇప్పటంలో పవన్‌ కల్యాణ్‌?

Chakravarthi Kalyan
మునుగోడులో కేఏ పాల్ మాదిరి, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఫ్లైట్ దిగినప్పటి నుండి ఉరుకులు పరుగులు పెడుతూ కామెడీ చేస్తున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు పబ్ రెక్కీ చేస్తే , చంద్రబాబు గులకరాయితో రెక్కీ చేశారనడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు.  పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యారు.. ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తున్నారు.. నానా అల్లరి చేస్తున్నారు.. ఈ డైలాగులన్నీ ఎవరివో తెలుసా.. మాజీ మంత్రి కొడాలి నాని ఇలా అంటున్నారు.
ప్రజల తరపున పోరాడటానికి సమస్యలు లేక వీరు తమ సొంత సమస్యలను ఎత్తి చూపుతున్నారని మండిపడ్డారు. వన్,చంద్రబాబు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని కొడాలి నాని  అంటున్నారు. ఇప్పటంలో ఎవ్వరి స్థలంలో నిర్మాణాలు పడకొట్టలేదని.. 90 శాతం ఇప్పటం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని కొడాలి నాని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: