జగన్ నిర్ణయంతో.. ఆ కులస్తులు ఫుల్ హ్యాపీస్‌?

Chakravarthi Kalyan
కాపు కులస్తులు ఏపీలో ఓసీల కిందకు వస్తారు. కానీ.. మున్నూరు కాపు కులస్తులు తెలంగాణలో బీసీలోకి వస్తారు. పోలవరం విలీన మండలాల్లోని మున్నూరు కాపు కులస్తులకు కూడా బీసీ –డీ కింద గుర్తింపు ఇచ్చినందుకు తాజా సీఎం జగన్ అంగీకరించారు. కొందరు మున్నూరు కాపు నేతలు చేసిన విజ్ఞాపనల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మున్నూరు కాపు కులస్తులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన  కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి, మున్నూరు కాపు సంఘం ఎటపాక డివిజన్‌ ప్రెసిడెంట్‌ ఉమాశంకర్ సీఎంకు ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. కాపుల సంక్షేమం,అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు  తీసుకుంటుందని ఆ నేతలు తెలిపారు. విలీన మండలాల్లోని మున్నూరు కాపులకు మేలు చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: