పాకిస్తాన్‌కు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన అమెరికా?

Chakravarthi Kalyan
పాకిస్థాన్ కు అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాకిస్తాన్‌కు భారీగా భద్రతా సహాయం అందించేందుకు అమెరికా అంగీకరించింది. పాకిస్తాన్‌కు  450 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ -16 యుద్ధ విమానాలు ఇచ్చేందుకు అమెరికా యోచిస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్ కు అమెరికా ఈ సాయం అందించబోతోంది. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ కాంగ్రెస్ కు నివేదించింది.

టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో పాక్  ఒక ముఖ్య భాగస్వామి అని అమెరికా అంటోంది. పాక్‌కు అమెరికా సాయం చేయడం కొత్తేమీ కాదు.. అయితే.. 2018లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  పాకిస్థాన్ కు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని ఆపేశారు. అఫ్గాన్  తాలిబన్లు, హక్కానీ నెట్ వర్క్  వంటి ఉగ్ర గ్రూపులను నిలువరించడంలో పాకిస్తాన్‌ విఫలమవుతోందన్నది అందుకు కారణం. అంతే కాదు.. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్  తమ భాగస్వామి కాదని కూడా అప్పట్లో ట్రంప్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: