పుతిన్ కళ్ల ముందే.. కళ్లు చెదిరే యుద్ధ విన్యాసాలు?
జపాన్ సముద్రంలో రష్యా, చైనా, భారత్, లావోస్, మంగోలియా, నికరాగువా, సిరియా వంటి దేశాలకు చెందిన 50వేల మందికి పైగా సైనికులు ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ యుద్ధ విన్యాసాల ప్రదర్శన కోసం 5వేలకు పైగా ఆయుధ వ్యవస్థలు ఇక్కడకు తరలి వచ్చాయని చెబుతున్నారు. అలా తరలి వచ్చిన వాటిలో 140 యుద్ధ విమానాలు ఉన్నాయట. ఇంకా 60 యుద్ధ నౌకలు కూడా విన్యాసాల కోసం తరలి వచ్చాయట. గత గురువారం ప్రారంభమైన ఈ సంయుక్త యుద్ధ విన్యాసాలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి.