శభాష్‌ టీటీడీ.. అద్భుత కార్యక్రమం..?

Chakravarthi Kalyan
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి జిల్లాలో రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. తిరుపతిలోని శ్వేతా భవనంలో టీటీడీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు, రాష్ట్రంలోని నోడల్ గోశాలల నిర్వాకులకు ఇటీవల రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం చేపట్టింది. దేశంలో మరే ససస్ధ చేపట్టని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ గో సంరక్షణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు టీటీడీ గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. నోడల్ గో శాలలు తమ పరిధిలో ఉన్న గోశాలలను సమన్వయం చేసుకుంటూ  వాటి నిర్వాహకులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించనున్నారు. గో పోషణకు ఇబ్బంది ఉన్న గోశాలలను ఆదుకునే ఆలోచన కూడా టీటీడీ చేస్తోంది. రైతులు గో ఆధారిత వ్యవసాయం పై దృష్టి పెట్టి  నేలతల్లిని... తద్వారా మానవాళిని కాపాడాలన్నదే టీటీడీ ఆశయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: