శభాష్‌ రెడ్ క్రాస్‌.. విడదల రజని అభినందన!

Chakravarthi Kalyan
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం మారుమూల గ్రామమైన రావులాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి విడదల రజని.. ఇది ఎంతో అభినందనీయమైన విషయమని.. దీనికి కృషి చేసిన పోలీస్ శాఖ మరియు రెడ్ క్రాస్ సంస్థ వారికి, వైద్య పరీక్షలు అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్లకు హృదయ పూర్వక అభినందనలు అని తెలిపారు.

మారుమూల గ్రామమైన రావులాపురం గ్రామంలోని పేదవారికి, వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో వినుకొండ ఏరియా రెడ్ క్రాస్ సంస్థ వారి సమన్వయంతో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు.

పేదవారికి వైద్య సదుపాయం అందించాలనే ఆశయం, ఆలోచన రావడం గొప్ప విషయం అని, దానికి పూనుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్  కృషి ప్రశంసనీయం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: