కలాం మెమోరియల్‌ స్కూల్‌.. వెరీ గ్రేట్ ?

Chakravarthi Kalyan
ప్రభుత్వ బడులంటే.. ఏమీ చెప్పరని.. పేదలు మాత్రమే అక్కడ పిల్లలను చేరుస్తారని అనుకుంటారు. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు బడులను మించి మరీ ఫలితాలు సాధిస్తాయి. అలాంటిదే కర్నూలులోని డాక్టర్. ఏ.పీ.జే. అబ్దుల్ కలామ్ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల.. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఏ.పీ.జే. అబ్దుల్ కలామ్ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులను కర్నూలు జిల్లా డీఈవో రంగారెడ్డి సన్మానించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి లో మంచి ఉత్తీర్ణత సాధించిన 8 ప్రభుత్వ పాఠశాలలో కర్నూలు లోని డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ పాఠశాల రెండో స్థానంలో ఉంది. ఆగస్టు 15  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పాఠశాల అధ్యాపకురాలు విజయలక్ష్మీ ప్రశంస పత్రాన్ని తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు గుర్తింపు తీసుకుని వచ్చినందుకు పాఠశాలలోని ఉపాధ్యాయులకు డీఈవో సన్మానించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు సాధించామని విజయలక్ష్మి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: