బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త?

Chakravarthi Kalyan

మన దేశంలో బంగారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియంది కాదు. కానీ అలాంటి బంగారం మన దేశంలో మాత్రం చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో ఇండియా స్థానం ప్రపంచంలోనే రెండోది. మనకంటే ముందు ఈ విషయంలోనూ చైనా ముందు ఉంది. భారతీయులు ఏటా దాదాపు 800-1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి.
మన దగ్గర ఇంత డిమాండ్ ఉన్నా.. బంగారం ధరను మాత్రం మనం నిర్ణయించలేకపోతున్నాం. అందుకు కారణం.. మన దగ్గర బులియన్ ఎక్సేంజ్‌ లేకపోవడమే.. అందుకే మనం చైనాలోని షాంఘై గోల్డ్‌ ఎక్స్ఛేంజీ, టర్కీలోని బొర్సా ఇస్తంబుల్‌, లండన్‌లోని ఎల్‌బీఎంఏ వంటి ఎక్స్ఛేంజీలపై ఆధారపడుతున్నాం. మన దేశంలోని బంగారం ధరలు కూడా ఈ ఎక్సేంజీల ద్వారానే నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఇండియాలోనూ బులియన్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజీని ప్రారంభించింది. దీనివల్ల త్వరలోనే మన వినియోగదారులపై పన్నుల భారం తగ్గి బంగారం ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: