తెలంగాణ కాబోయే సీఎం ఈటెల రాజేందర్‌?

Chakravarthi Kalyan
తెలంగాణకు కాబోయే సీఎం ఈటల రాజేందర్ అంటూ ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందించారు. తాను సీఎం అభ్యర్థి అన్న ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఈటల రాజేందర్  అన్నారు. బీజేపీ కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారన్నారు. బీజేపీలో   పదవులు వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని.. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని ఈటల రాజేందర్  తెలిపారు.

నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్న ఈటల రాజేందర్ . ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ పలు పత్రికలు, చానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను  ఖండిస్తున్నానన్నారు.  నేను 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానన్న ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన అంతమే తన లక్ష్యం అన్నారు. కాషాయ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేయడం కోసం పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: