ఇండియాకు అద్భుత వరం అందిస్తున్న యూఏఈ?

Chakravarthi Kalyan
యూఏఈ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒకటి.. అలాంటి దేశం మన భారత్‌ వ్యాప్తంగా సమీకృత ఆహార పార్కుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టబోతోంది. ఏకంగా 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది.  భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలసి ఇటీవల ఐ-టూ-యూ-టూ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఈ కూటమి తొలి భేటీ సందర్భంగా ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాట ఇచ్చింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని యైర్‌ లాపిడ్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్‌బిన్‌ జాయెద్‌ పాల్గొన్నారు. ఆహార భద్రత సంక్షోభం, శుద్ధ ఇంధనం సహా దీర్ఘకాలిక ఆహార ఉత్పత్తి, సరఫరా కోసం సృజనాత్మక మార్గాలపై ఈ కూటమి చర్చించింది. ఐ-టూ-యూ-టూ కూటమి తొలి సదస్సులో సానుకూల ఎజెండా ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: