మోదీ టూర్‌లో నల్ల బెలూన్ల గోల.. ఏందీ రచ్చ?

Chakravarthi Kalyan
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్  నాయకులు నిన్న పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేశారు. అయితే.. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్  టేకాఫ్ అయి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే వారు నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. అయితే.. నల్లబెలూన్లు ఎగురవేయడాన్ని ఎస్‌పీజీ అధికారులు భద్రతా లోపంగా పరిగణిస్తున్నారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో డీఎస్పీ విజయ్ పాల్  నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు బెలూన్లు ఎగురవేసినట్లు గుర్తించి ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్  నేత సుంకర పద్మశ్రీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. కొన్ని దుష్టశక్తులు బెలూన్లు ఎగరవేశాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి... దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: