ఆ విషయంపై చర్చకు రా.. బాబుకు బొత్స సవాల్‌?

Chakravarthi Kalyan
మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు సవాల్ విసిరారు.. సామాజిక న్యాయంపై చంద్రబాబుతో చర్చకు రెడీ అని సవాల్ విసిరారు.. ఈ డిబేట్‌కు నువ్వు వస్తావో.. నీ తాబేదారులు వస్తారో రండి.. అంటూ మంత్రి బొత్స సవాల్ విసిరారు.. ఖాళీగా ఉన్న చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందని... హెరిటేజ్‌ వ్యాపారం చూసుకుంటూ ఏజ్యూస్‌ ఎంత, ఏ పాలు ఎంత, ఏ పెరుగు అంత  అనేది చంద్రబాబుకు అలవాటైపోయినట్టుందని మంత్రి బొత్స అన్నారు.

చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయాడని.. అధికారంలో ఉన్నప్పుడు విజయనగరంలో మంత్రిగా ఎవరికి అవకాశం ఇచ్చాడో గుర్తు తెచ్చుకోవాలన్నారు. అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రి, వైయస్‌ఆర్‌ సీపీలో గెలిచి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి సుజయ కృష్ణరంగారావుకు మంత్రి పదవి ఇచ్చాడని.. ఇలాంటి వ్యక్తి సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా అంటూ ఎద్దేవా చేశారు. విజయనగరంలో సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక మెడికల్ కాలేజీ  మంజూరు చేశారని.. .. కాలేజీ నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి బొత్స అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: