బ్రేకింగ్: ఇండోనేషియాలో భారీ భూకంపం..!!

N.ANJI

ఇండోనేషియా దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున కెపులవన్ బరత్ దయాలో భూకంపం వచ్చింది. దీంతో భయాందోళనకు చెందిన అక్కడి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఏకంగా భూకంప తీవ్ర 6.4గా నమోదైనట్లు యురోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. ఈ భూకంపం కెపులవన్ బరత్ దయాకు ఈశాన్యం నుంచి సుమారు 86 కి.మీటర్ల దూరంలో కంపించినట్లు వెల్లడించారు. భూ అంతర్భాగంలో సుమారు 131 కిలోమీటర్ల లోతులో భూమి కంపించడం వల్ల ఈ తీవ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో ఎటువంటి నష్టం జరిగిందనే వివరాలను వెల్లడించలేదు.


కాగా గతేడాది డిసెంబర్ నెలలో కూడా ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ దీవిలో సంబంధించిన ఈ భూకంపం తీవ్రత అప్పుడు రిక్టర్ స్కేలులో 7.7గా నమోదైంది. ఆ సమయంలో భూకంపం సంభవించిన ప్రాంతానికి చుట్టూ 1000 కి.మీ మేరా భయంకర అలలు ఎగసి పడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇండోనేషియా పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి. 2004లో ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం తీవ్ర విషాదానికి దారి తీసింది. రిక్టర్ స్కేలు మీద 9.1 తీవ్రత నమోదైంది. దాదాపు 2,20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇండోనేషియాకు చెందిన వారు 1,70,000 మంది. ఈ ఘటన చరిత్రలోనే అత్యంత ఘోరమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: