జైభీమ్ : మ‌రొక మూడు అవార్డులు ఖాతాలోకి..?

N ANJANEYULU
త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన జైభీమ్ చిత్రం ఇప్ప‌టికే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. అయితే మ‌ళ్లీ ఈ చిత్రం వార్త‌ల్లో నిలిచింది. సూర్య న‌టించిన రియాలిస్టిక్ మూవీ ఇటీవ‌లే ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం 9వ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసిన‌ట్టు మేక‌ర్స్ అధికారికంగానే ప్ర‌క‌టించారు. ఇప్పుడు తాజాగా ఈ స‌క్సెస్ పుల్ సినిమాకు ఫిలిం నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ 3 బెస్ట్ అవార్డులు వ‌చ్చాయి.
ఉత్త‌మ చిత్రం అవార్డుతో పాటు ఈ చిత్రంలో సూర్య‌, లిజ్మోల్ జోస్‌ల అద్భుత‌మైన న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ నటి అవార్డుల‌ను కూడా గెలుచుకుంది ఈ చిత్రం. తాజాగా ఈ వార్త‌తో సూర్య అభిమానుల‌తో పాటు చిత్ర‌బృందం కూడా సంతోషం వ్య‌క్తప‌రుస్తున్నారు. మ‌ణికంద‌న్‌, రావు ర‌మేష్‌, ప్ర‌కాశ్‌రాజ్ కూడా ఈ చిత్రంలో త‌మ అత్యుత్త‌మ న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. టీజే జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ లీగ‌ల్ డ్రామా ప్ర‌త్యేక ఫీచ‌ర్ ఇటీవ‌ల ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: