బిగ్ బ్రేకింగ్ : తిమ్మరాజు పాళెం వద్ద దగ్గమైన బస్సు?


హైదరాబాద్ నుంచి బయలుదేరి చీరాలు వస్తున్న బస్సు ప్రకాశం జిల్లా తిమ్మరాజు పాళెంవద్ద బస్సులో మంటలు చెలరాగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్కున్న ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకేశారు. ఈ సమయంలో కొంత తొక్కిసలాట జరిగింది. ప్రయాణీకుల హాహాకారాలతో కొంత సేపు గందర గోళం నెల కొంది. బస్సులో ప్రయాణిస్తున్న పోలీసొకరు ప్రయాణీకులకు ధైర్యం చెప్పి , అందరినీ సురక్షితంగా బైటపడేలాచేసినట్లు సమాచారం. ప్రయాణీకులకు తమ లగేజీని వెలుపలకితీసుకు వచ్చేందకు వీలు కాలేదని తెలిసింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ఘమైంది. ఇది ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సుగా ప్రాయాణీకులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. స్థానికులు గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జీల్లా జల్లే రు వంతెన వద్ద వాగులో బస్సు పడి పది మంది దుర్మరణం చెందిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాక ముందే బస్సుకు  అగ్నికి ఆహుతి అవడంతో ప్రయాణీకులు భీతిల్లుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: