జనవరి 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ..!

N ANJANEYULU
నూత‌న సంవ‌త్స‌రం నుంచి బ్యాంకు ఖాతాదారుల‌కు షాక్ త‌గ‌ల‌నున్న‌ది. ముఖ్యంగా 2022 జ‌న‌వ‌రి 1 నుండి ఏటీఎం సెంట‌ర్‌ల‌లో అప‌రిమిత లావాదేవీలు జ‌రిపితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉండ‌నున్న‌ది.  ఈ మేర‌కు అప‌రిమిత లావాదేవీలపై రుసుములు పెంచుతున్న‌ట్టు రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన‌ది. ప్ర‌తీ నెల ఉచిత ఏటీఎం లావాదేవీల ప‌రిమితి దాటితే ఎక్కువ రుసుములు వ‌సూలు చేస్తాం అని తెలిపిన‌ది. ఈ మేర‌కు క‌స్ట‌మ‌ర్ల నుంచి జ‌రిమానా వ‌సూలు చేసేందుకు దేశంలోని ప‌లు బ్యాంకుల‌కు ఇప్ప‌టికే ఆర్‌బీఐ అనుమ‌తిని కూడా ఇచ్చింది.
ప్ర‌తీ నెల సొంత బ్యాంకుల‌కు చెందిన ఏటీఎంల‌లో ఐదు లావాదేవీలు, ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లోఅయితే మూడు లావాదేవీలు మాత్ర‌మే ఉచితంగా ల‌భించ‌నున్నాయి. దాని ప‌రిమితి దాటితే మాత్రం ఒక్కో ట్రాన్‌స‌క్ష‌న్‌కు రూ.21 చొప్పున బ్యాంకులు వ‌సూలు చేయ‌నున్నాయి. ఈ ఛార్జీతో పాటు అద‌నంగా బ్యాంకులు, ట్యాక్స్‌లు వ‌సూలు చేస్తాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టికే యాక్సిస్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు సందేశాలు పంపి అప్ర‌మ‌త్తం చేస్తూ ఉన్నాయి. గ‌తంలో ఉచిత లావాదేవీల ప‌రిమితి దాటితే రూ.15 లేదా రూ.20 మాత్ర‌మే బ్యాంకులు వసూలు చేసేది.  ఇప్పుడు ఆర్‌బీఐ అనుమ‌తి ప్ర‌కారం.. రూ.21 మించి ఎక్కువ ఛార్జీల‌ను బ్యాంకులు వ‌సూలు చేయ‌నుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: