మయన్మార్ లో విమాన ప్రమాదం .. 12 మంది దుర్మరణం..

Satvika
మిలటరీ విమానం కుప్ప కూలింది. ఈ విమానంలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. అందు లో 12 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఒక ఫైలెట్, మరో వ్యక్తి తప్ప తక్కిన వారంతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. భారత సరిహద్దు దేశం మయన్మార్‌ లో జరిగింది.  గత ఏడాది లో కూడా ఇలానే మిలటరీ విమానం కుప్పకూలి పోయింది.  ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు.
విమాన పైలట్‌తో పాటు, మరొకరు ప్రాణాల తో బయటపడ్డారు. తీవ్ర గాయాలు కావడం తో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ అధికారులు అందించిన వివరాల మేరకు.. మయన్మార్ మిలటరీ విమానం రాజధాని నేపిడా నుంచి పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. అయితే, మొదలైనప్పుడు కండీషన్ బాగానే ఉన్న ఈ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఏమైందో తెలియకుండా .. ఆకాశంలో అదుపుతప్పి, మాండలేలోని స్టీల్ ప్లాంట్‌ సమీపంలో కుప్పకూలింది.

దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడిపోయినట్లు మిలటరీ నేతృత్వం లోని మియవాడి టెలివిజన్ తెలిపింది. విమానం లో ఆరుగురు మిలటరీ సిబ్బంది తో పాటు పలువురు సాధువులు ఉన్నారు. వారంతా ఓ బుద్దిస్ట్ మఠాని కి వెళ్లాల్సి ఉందని అంతలోనే ఈ ఘోర జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం లో విమానం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. విమాన ముందు భాగం మొత్తం చెల్లా చెదురు అయ్యింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం తో మరణాల సంఖ్య ఎక్కువ అయిందని అధికారులు చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది.. విషాద ఛాయలు అలముకున్నాయి.. ఈ ఘటన పై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: