ఒక గబ్బిలం మనిషిని ఏం చేయగలదు అనుకుంటారు కొందరు కానీ ఏకంగా విమానాన్ని సైతం దారి మళ్లించగలదు అని ఒక తాజా సంఘటన రుజువు చేసింది. నెవార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం గురువారం ఉదయం ఒక గబ్బిలం కారణం గా తిరిగి ఢిల్లీ కి చేరుకుంది. అందుకు గల కారణం ఒక గబ్బిలం విమానంలో ఉండటం సిబ్బంది గమనించడం తో టేకాఫ్ అయిన అరగంట కే నెవార్క్ వెళ్లకుండా తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది విమానం. అందుకే అంటారు పెద్దలు ఏది తక్కువగా అంచనా వేయకూడదు అని.