ఉత్తరాఖండ్ అడవుల్లో భారీ కార్చిచ్చు..!!

KISHORE
 ఉత్తరాఖండ్ కు ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది.. ఇటీవల ఆకస్మిక జలప్రళయం తో విలవిలలాడిన ఉత్తరాఖండ్ లో తాజాగా మరో ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని చామోలీ అడవులల్లో భారీ కార్చిచ్చు అంటుకుంది..దీంతో దాదాపుగా 3000 ఎకరాల అడవి అగ్నికి ఆహుతి అయ్యింది..మంటలను ఆర్పడానికి హెలికాప్టర్లను పంపాలని ఆ రాష్ట్రం రక్షణ శాఖను కోరగా వెంటనే అప్రమత్తం అయిన ప్రభుత్వం ఘటన స్థలనికి హెలికాప్టర్ లను పంపి మంటలను అదుపు లోకి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టింది. .

అటవీ ప్రాంతంలోని 62 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని నలుగురు వ్యక్తులు, మూగ జీవలు సజీవ దహనం అయ్యాయి. మంటలను అర్పేందుకు 12వేల మంది అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు 37 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం గతంలో నవంబర్- జనవరి మద్య ఉత్తరాఖండ్ లో 470 చోట్ల మంటలు సంభవించినట్లు తెలిపింది. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: