జగన్ కేసుల్లో ఐఏఎస్ పై మరిన్ని కేసులు

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్ షీట్ లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు చేసారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2)నూ పరిగణనలోకి తీసుకుంది కోర్టు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో సీబీఐ కోర్టుకు బీపీ ఆచార్య హాజరు అయ్యారు.  కొత్త సెక్షన్లపై హైకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని బీపీ ఆచార్య కోరారు.  లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈనెల 26కి వాయిదా వేసింది సీబీఐ  కోర్ట్.
ఇండియా సిమెంట్స్, ఇందూ టెక్ జోన్ కేసులు ఈనెల 26కి వాయిదా వేసారు. అరబిందో, హెటిరో, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులు ఈనెల 26కి వాయిదా వేసారు.  రఘురాం సిమెంట్స్ కేసు ఈనెల 22కి, దాల్మియా కేసు ఏప్రిల్ 9కి వాయిదా వేసారు. ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: