ఆరు గ్యాస్ సిలిండర్లు పేలి..భారీ అగ్ని ప్రమాదం !!

KISHORE
 తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ గాంధీనగర్‌లోని ఎల్విన్‌పేట్‌ దారుణం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో చోటు చేసుకున్న ఘటనలో ఓ వృద్ధురాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది.. వివరాల్లోకెళితే.. స్థానిక పూరి గుడిసెలో టీ స్టాల్ నిర్వహిస్తుండగా సిలిండర్ లోని గ్యాస్ లీక్ కావడం వల్ల హటాత్తుగా మంటలు చెలరేగి అక్కడే ఉన్న మిగతా ఆరు సిలిండర్లకు మాటలు వ్యాపించడంతో ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా పేలడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి.
దాంతో పక్కనే ఉన్న ఆరు పూరి గుడిసెలకు మంటలు వ్యాపించాయి. దీంతో గుడిసెలో ఉన్న ఒక వృద్దురాలు మంటలలో సజీవ దహనం అయ్యింది. ఈ ఘటనతో  స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎగసి పడుతున్న మంటలను ఆర్పడం జరిగింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో చనిపోయిన వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: