ఏపీ సర్కార్ కి సోము కొత్త ప్రశ్న...!

కరోనా వ్యాప్తంగా ఇప్పుడు మన దేశంలో చాలా వరకు కూడా భక్తి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తుంగభద్ర పుష్కరాల హడావుడి నడుస్తుంది. ఈ నేపధ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం కరోనా జాగ్రత్తల కారణంగా పుష్కరాలలో స్నానాలు చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
పుష్కరాలలో స్నానాలు చేయకూడదట! అయితే మరి, తుంగభద్ర పుష్కరాలకు ₹.200/- కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అని ఆయన నిలదీశారు. నీటి ప్రవాహ వేగాన్ని పెంచి స్నానాలకు అనుమతి ఇవ్వాలి అని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. వచ్చిన భక్తుల కోసం ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేయాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: