భారత్ - చైనా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఫ్తీ..!

Lokesh
భారత భూభాగం నుంచి చైనాను వెళ్లగొట్టలేరు కానీ, కార్పొరేట్ల కోసం కశ్మీరీల భూమిని లాక్కొవాలనుకుంటున్నారు" అని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కశ్మీర్​లో ఎవరైనా భూమి కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేయటాన్ని తప్పుపట్టారు. కశ్మీర్​ను కొల్లగొట్టాలనేదే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు.

జమ్ముకశ్మీర్​లో దేశంలోని ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ.. భూచట్టాల్లో మార్పులు చేయటంపై గురువారం ఉదయం ఆందోళన చేపట్టింది పీడీపీ. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు కార్యకర్తలు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. శ్రీనగర్​లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేసి.. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్​ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: