రైల్వే జోన్ కు అర్హత లేదన్నారు... ఇప్పుడు ఆ స్టేషన్ కు అరుదైన అవార్డ్..!

Lokesh
గ్రీన్ రైల్వే స్టేషన్​ రేటింగ్​లో ఇంతకు ముందు ప్లాటినం అవార్డును సికింద్రాబాద్, జైపూర్ స్టేషన్లు పొందాయి. ఈ అవార్డు పొందిన మూడో స్టేషన్​గా విశాఖ గుర్తింపు పొందింది. భారతీయ రైల్వే పర్యావరణ డైరెక్టరేట్ పూర్తిగా సహకరించడం వల్ల విశాఖ రైల్వే స్టేషన్​కు ఈ రేటింగ్ లభించిందని అధికార వర్గాలు వివరించాయి. నీటి పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, హానికర ఇంధనాలు వినియోగంలో పూర్తిగా నియంత్రణ, పర్యావరణ హితమైన పరికరాలు, వనరుల వినియోగం వంటి అంశాల్లో మంచి స్కోర్ సాధించింది విశాఖ రైల్వే స్టేషన్​. మొత్తం 100 పాయింట్లకు గాను.. 82 పాయింట్లు దక్కించుకుంది.


రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇంధన, జల వినియోగం వంటివాటిలో మెరుగైన పద్ధతుల అనుసరణ వల్ల మంచి స్కోర్ సాధ్యపడిందని అధికారులు వివరించారు. 2017లో భారతీయ రైల్వేలో పరిశుభ్రమైన స్టేషన్గా విశాఖ నిలిచింది. 2018లో సప్తగిరి అవార్డు, 2019లో బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ స్టేషన్గా అవార్డులను కైవసం చేసుకుంది విశాఖ స్టేషన్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2019లో ఉత్తమ ర్యాంకును ఈ స్టేషన్ కు అందించింది. ర్యాంకు వచ్చేందుకు కారణమైన సిబ్బంది కృషిని.. డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. విశాఖ రైల్వే స్టేషన్ కు మరో అవార్డు రావడం ఆనందకరమని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏ.కె. త్రిపాఠి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: