గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్...!

ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘమైన అంతరాయంతో తమ వినియోగదారులు ఇబ్బంది పడటంపై గూగుల్ క్షమాపణలు చెప్పింది. జిమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్ మరియు గూగుల్ మీట్ వంటి అనేక గూగుల్ సర్వీసులు పునరుద్ధరించబడ్డాయని ప్రకటించింది. అసౌకర్యానికి టెక్ దిగ్గజం క్షమాపణలు చెప్పింది, సిస్టమ్ విశ్వసనీయతకు గూగుల్‌లో అధిక ప్రాధాన్యత ఉందని  సంస్థ పేర్కొంది.
మధ్యాహ్నం 2:08 గంటల నుంచి మేము ఈ సమస్య గుర్తించి దర్యాప్తు చేస్తూనే ఉన్నామని గూగుల్ పేర్కొంది. మేము 8/20/20, 3:08 PM  సమయానికి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. మీ సహనానికి మరియు నిరంతర మద్దతుకు ధన్యవాదాలు అని గూగుల్ పేర్కొంది. అటు యుట్యూబ్ లో కూడా వీడియో లు పోస్ట్ కాలేదు. దీనిపై కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. మెసేజ్ లు పంపడం, వాయిస్ మెయిల్ సెండ్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించామని గూగుల్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: