గుడ్ న్యూస్‌:  వంట‌గ్యాస్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయ్‌.... సిలిండ‌ర్ రేటు ఇంత త‌క్కువా..!

VUYYURU SUBHASH

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఎఫెక్ట్‌తో అంత‌ర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా ప‌డిపోవ‌డంతో ఆ ప్ర‌భావం వంట గ్యాస్ ధ‌ర‌ల‌పై ప‌డింది. అక్క‌డ క్రూడ్ ఆయిల్ నిల్వ‌లు పేరుకుపోవడంతో ఇక్క‌డ మ‌న దేశీయ మార్కెట్లో  వంట గ్యాస్ సిలిండ‌ర్ రేట్లు బాగా త‌గ్గాయి. ఈ స‌వ‌రించిన కొత్త రేట్లు ఈ రోజు ( మే 1వ తేదీ ) నుంచే అమ‌ల్లోకి రానున్నాయి.  హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 207 త‌గ్గి  రూ. 589.50 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధ‌ర రూ. 988 కి చేరింది. 

 

ఓ విధంగా చెప్పాలంటే ఇది మామూలు త‌గ్గింపు కాద‌నే చెప్పాలి. ఇక దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో  ఎల్‌పిజి ( లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి  రూ. 581.50 గా ఉంది.  ముంబైలో 714.50 తో  పోలిస్తే  తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో  రూ. 190 తగ్గి రూ. 584.50,  చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర‌లు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా  గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రలు మారుతూ వుంటాయి. ఇప్పుడున్న సంక్లిష్ట ప‌రిస్థితుల్లో అన్ని వ‌స్తువులు, నిత్యావ‌స‌రాల రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో వంట గ్యాస్ రేట్లు త‌గ్గ‌డం సామాన్యుల‌కు పెద్ద ఊర‌టే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: