కోర్టు తీర్పును రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం దారుణం

Kaumudhi

కోర్టు తీర్పుల‌ను కూడా రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం దారుణ‌మ‌ని మంత్రి సురేశ్ అన్నారు. ఏపీలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధ‌న‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తి టీడీపీకి ఇష్టం లేద‌ని, హైకోర్టు తీర్పును టీడీపీ రాజ‌కీయం చేస్తోంద‌ని ఆయ‌న‌ అన్నారు. ఇప్ప‌టికే ల‌క్ష‌మంది టీచ‌ర్ల‌కు కూడా శిక్ష‌ణ ఇచ్చామ‌ని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ఏర్పాటుకు పేరెంట్స్ క‌మిటీలు కూడా తీర్మానాలు ఇచ్చాయ‌ని, ఆ తీర్మానాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని ఆయ‌న తెలిపారు.

 

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వ‌కూడ‌దా..? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు ర‌వాణా ఖ‌ర్చులు కూడా చెల్లిస్తామ‌ని అన్నారు. పేద‌ల వ‌ర్గాల పిల్ల‌ల‌కు ఇంగ్లిష్ బోధ‌న అందించాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ధ్యేయ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఒక్క‌సారి మాట ఇస్తే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌చ్చితంగా చేసి తీరుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డానికి, వారు ఉన్న‌త స్థాయి చేరుకోవ‌డానికి సీఎం జ‌గ‌న్ అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని అన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: