హెరాల్డ్ బర్త్ డే : 04-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జులై 4వ తేదీన ఒకసారి చరిత్రలోకి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి.  మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 


 అల్లూరి సీతారామరాజు జననం : స్వతంత్ర పోరాటంలో మహోజ్వల  శక్తిగా... సాయుధ పోరాటం ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు అల్లూరి సీతారామరాజు. శాంతి  ద్వారా కాదు సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మిన మహోన్నత శక్తి అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4 వ తేదీన జన్మించారు, బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన సాయుధ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరికి  మన్యం వీరుడు అని కూడా బిరుదు ఉంది.  అప్పట్లో బ్రిటిష్ వాళ్లు దురాగతాలను ఎదురించి నిలబడి ప్రజలందరినీ చైతన్యపరిచి తిరుగుబాటు చేసిన గొప్ప  స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు, స్వతంత్ర సంగ్రామంలో సాయుధ పోరాటం పేరుతో నిప్పు కణికల ఎగిసి  స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి తూటలకు భయపడకుండా రొమ్ము విరుచుకుని నిలబడ్డ ధీశాలి  అల్లూరి సీతారామరాజు.


 గుర్జీలాల్  నంద జననం : భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆర్థికవేత్త అయిన గుర్జీలాల్  నంద 1898 జులై 4వ తేదీన జన్మించారు, భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించారు, తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత... రెండవ సారి లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవిని అలంకరించారు. రెండు సార్లు కూడా కేవలం నెల సమయం వరకు మాత్రమే ప్రధాన మంత్రిగా కొనసాగారు. మొదటిసారి 1957లో  లోక్సభ ఎన్నికలకు ఎన్నికయ్యాడు, 

 

 ఎం ఎం కీరవాణి జననం : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి 1961 జులై 4వ తేదీన జన్మించారు. కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. 1989 లో నిర్మించిన మనసు మమత అనే తెలుగు చిత్రం ద్వారా ఎం.ఎం.కీరవాణి తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ కన్నడ హిందీ పరిశ్రమలో కూడా గొప్ప సంగీత దర్శకుడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక 1997లో వచ్చిన అన్నమయ్య  చిత్రానికి గానూ దేశంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును సైతం అందుకున్నారు.ఇక్కడ ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి  తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. 

 

 జోగు రామన్న జననం  : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  మంత్రివర్గంలో పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తి జోగు రామన్న  1961 జులై 4వ తేదీన జన్మించారు. 1984 తెలుగుదేశం పార్టీలో చేరిన జోగురామన్న ఎంపీటీసీ జడ్పిటిసి స్థాయి నుంచి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగారు, 2011 తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం  సంపాదించారు జోగురామన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: