పులిపిర్లు ఈజీగా వారంలో తగ్గే టిప్?

Purushottham Vinay
పులిపిర్ల వల్ల ఎలాంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి చాలా అందవిహీనంగా ఉంటాయి. చాలా మంది కూడా వీటిని సర్జరీల ద్వారా తొలగించుకుంటారు. కొందరు చాకు, బ్లేడు వంటి వాటితో వీటిని కట్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి అన్ని కూడా చాలా నొప్పిని కలిగించే పద్దతులు. కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల చాలా ఈజీగా మనం పులిపిర్లను తొలగించుకోవచ్చు. ఈ టిప్స్ వాడడం వల్ల ఎలాంటి నొప్పి ఉండదు అలాగే ఇవి ఎటువంటి దుష్ప్రభావాలను కూడా కలిగించవు.పులిపిర్లను తగ్గించడంలో ఉల్లిపాయ మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో చాలా ఎక్కువగా ఉండే సల్ఫర్ పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది.దీని కోసం ఉల్లిపాయను తీసుకుని దానిని ముక్కలుగా కట్ చేసి జార్ లో వేసుకోవాలి. ఆ తరువాత దీనిని పేస్ట్ గా చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనెని వేసి కలపాలి.ఇక తరువాత ఇప్పుడు ఇందులో దూదిని లేదా కాటన్ బడ్ ను ముంచి పులిపిర్లపై రాయాలి.


ఆ తరువాత వీటిపై ప్లాస్టర్ లేదా బ్యాండేజ్ వేసి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేయడం వల్ల పులిపిర్లు ఈజీగా వాటంతట అవే రాలిపోతాయి. అలాగే వెల్లుల్లిలో యాంటీ వైరస్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి.ఇవి పులిపిర్లను తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయి. దీని కోసం వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని బాగా మెత్తని పేస్ట్ లాగా చేయాలి.ఆ తరువాత ఈ పేస్ట్ ను పులిపిర్లపై రాసి ఇక బ్యాండేజ్ ని వేసుకోవాలి. ఆ తరువాత దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక వారం రోజుల పాటు ఇలా వెల్లుల్లి మిశ్రమాన్ని రాసుకోవడం వల్ల పులిపిర్లు చాలా ఈజీగా వాటంతట అవే తొలగిపోతాయి. ఈ విధంగా ఈ రెండు టిప్స్ పాటించడం వల్ల  న్యాచురల్ గా అసలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పులిపిర్లను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: