తెల్ల జుట్టు సమస్యని తేలిగ్గా పోగొట్టే టిప్?

Purushottham Vinay
తెల్ల జుట్టు సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు చాలా మంది మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.అయితే వీటిని ఉపయోగించడం వల్ల భవిష్యత్‌లో ఖచ్చితంగా జుట్టు సమస్యలు తీవ్రతరమయ్యే ఛాన్స్‌ ఉందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.సౌందర్య నిపుణులు అభిప్రాయం ప్రకారం..పలు ఔషధ గుణాలు కలిగిన హెయిర్‌ కలర్‌ను వాడటం వల్ల తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా హెన్నతో చేసిన హెయిర్‌ కలర్‌ను మీరు వాడడం వల్ల జుట్టు చాలా తొందరగా నల్లబడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ హెన్న హెయిర్‌ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.హెన్న హెయిర్‌ మాస్క్‌ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్థాలు.100 గ్రా హెన్న,1 నిమ్మకాయ,1 టీ స్పూన్‌ కాఫీ పౌడర్‌ ఇంకా సరిపడ నీరు.


దీని తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు హెన్న హెయిర్‌ మాస్క్‌ను తయారు చేయడానికి ఒక బౌల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.ఇంకా అలాగే మొదట ఆ గిన్నెలో హెన్నను వేసి.. నిమ్మరసంని పిండాల్సి ఉంటుంది.ఇక ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్‌ కాఫీ పౌడర్‌ ని వేసి మళ్లీ కలుపుకోవాలి.ఇక ఇలా అన్ని మిశ్రమాలను ఒకేసారి కలుపుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టాల్సి ఉంటుంది.ఇక అంతే చాలా సులభంగా హెయిర్‌ మాస్క్‌ తయారైపోతుంది.దీన్ని జుట్టుకు అప్లై చేసే ముందు జుట్టును క్లీన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత ఈ హెయిర్‌ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయాలి.ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.ఆ తర్వాత జుట్టును బాగా శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవాలి.అయితే ఇక ఈ మాస్క్‌ను వినియోగించే క్రమంలో 24 గంటల తర్వాత షాంపూతో తల స్నానం చెయ్యాలి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని ట్రై చెయ్యండి. తెల్ల జుట్టు సమస్యని ఈజీగా పోగొట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: