పాదాల పగుళ్ళు పోయి అందంగా అయ్యే టిప్?

Purushottham Vinay
పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల పాదాలపై మురికి ఇంకా మృతకణాలు పేరుకుపోయి క్రమంగా అవి పగుళ్లకు దారి తీస్తాయి. ఇంకా అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, అధిక బరువు అలాగే నీటిని తక్కువగా తాగడం వంటి వివిధ కారణాల చేత పాదాల పగుళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పగుళ్ల నుండి రక్తం కారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది.అయితే పాదాల పగుళ్లతో బాధపడే వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఓ సూపర్ టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల పాదాల పగుళ్లను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.ఇంకా ఈ సింపుల్ టిప్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బంగాళాదుంపను తీసుకోవాలి.ఆ తరువాత దీనిపై ఉండే తొక్కను తీసేసి ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. తరువాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి రసాన్ని తీసుకోని ఈ రసంలో అర చెక్క నిమ్మరసాన్ని పిండి నిమ్మతొక్కను పడేయకుండా పక్కకు ఉంచాలి. ఆ తరువాత ఇందులో మనం వాడే టూత్ పేస్ట్ ను వేసి కలపాలి.


 ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు వేడి నీటిలో పాదాలను పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత పాదాలను నిమ్మతొక్కతో బాగా రుద్దాలి.ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే మురికి ఇంకా మృతకణాలు ఈజీగా తొలగిపోతాయి. ఇక ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ పాదాలకు రాసుకోవాలి. దీనిని పూర్తిగా ఆరే దాకా అలాగే ఉంచి ఆ తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు చాలా సులభంగా తగ్గుతాయి. అలాగే పాదాలకు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇంకా పాదాలకు తగినంత తేమ లభించి పాదాలు పొడిబారకుండా ఉంటాయి. ఈ టిప్ ని వారానికి మూడు నుండి నాలుగు సార్లు పాటించడం వల్ల పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. ఇంకా ఈ  టిప్ ని పాటిస్తూనే నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: