అరటి తొక్కతో ఇలా చేస్తే సూపర్ బ్యూటీ మీ సొంతం?

Purushottham Vinay
అరటి తొక్కలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి.మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అరటి తొక్క చాలా బాగా సహాయపడుతుంది. చర్మంపై ఉండే ముడతలను, మొటిమలను, మచ్చలను ఇంకా అలాగే గాయల వల్ల కలిగిన మచ్చలను తొలగించడంలో అరటి తొక్క మనకు చాలా బాగా సహాయపడుతుంది.మీరు తాజా అరటి తొక్కను ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఒక ముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవాలి.అది ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు ఇంకా అలాగే ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మొటిమల సమస్యతో బాధపడే వారు ఈ అరటి తొక్కను రాత్రి పడుకునే ముందు ముఖానికి రుద్దుకుని పొద్దున్నే కడిగి వేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల మొటిమల సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే అరటి తొక్కతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం మన ముఖాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. ఒక జార్ లో నాలుగు అరటి తొక్క ముక్కలను ఇంకా ఒక చిన్న ముక్క అరటి పండును వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండి ఇంకా అర టీ స్పూన్ తేనె వేసి కలపాలి.


ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి.అది ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక ఇలా మీరు వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మ సమస్యలు అన్ని ఈజీగా తగ్గి ముఖం అందంగా ఇంకా అలాగే కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ మిశ్రమంలో నిమ్మరసం ఇంకా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరుకుండా ఉంటాయి. ఇంకా అదే విధంగా చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం ఇంకా ట్యాన్ పేరుకుపోవడం వంటి సమస్యలతో బాధపడే వారు ఇదే మిశ్రమంలో బియ్యం పిండికి బదులుగా శనగపిండి వేసి కలిపి మీ ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు ఇంకా మురికి తొలగిపోయి చర్మం అందంగా తయారవుతుంది. ఈ విధంగా అరటి తొక్క మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: