పాదాల పగుళ్ళు తగ్గి అందంగా మారాలంటే..?

Purushottham Vinay
పాదాల పగుళ్ళు తగ్గి అందంగా మారాలంటే ముందుగా ఒక జార్ లో బంగాళాదుంప ముక్కలను తీసుకోని ఆ తరువాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత వస్త్రంతో లేదా స్ట్రెయినర్ సహాయంతో బంగాళాదుంప మిశ్రమాన్ని వడకట్టి దాని నుండి రసాన్ని పిండి తీయాలి. ఈ రసాన్ని పాదాల పగుళ్లపై రాయడం వల్ల పాదాలు చాలా ఈజీగా తెల్లగా మారడంతో పాటు పగుళ్లు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అదే విధంగా ఈ బంగాళాదుంప రసంలో, ఒక టీ స్పూన్ టూత్ పేస్ట్ ఇంకా అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పక్కకు ఉంచాలి. ఆ తరువాత ఒక పెద్ద పాత్రలో లేదా బకెట్ లో గోరు వెచ్చని నీటిని మీరు తీసుకోవాలి. ఆ తరువాత అందులో రాళ్ల ఉప్పును వేసి పది నిమిషాల పాటు పాదాలను అందులో ఉంచాలి. తరువాత నిమ్మచెక్కతో మీరు మీ పాదాలకు సున్నితంగా మర్దనా చేసుకోవాలి.ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పాదాలకు పట్టించి అవి ఆరిన తరువాత వాటిని శుభ్రం చేసుకోవాలి.


ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పాదాలపై పేరుకుపోయిన మురికి ఇంకా అలాగే మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోయి పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఈ టిప్ ని వారానికి రెండు సార్లు ఖచ్చితంగా పాటించాలి.ఇంకా అదే విధంగా ఎక్కువగా షూస్ ధరించే వారు ప్యాడెడ్ షూస్ ను ఖచ్చితంగా ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీ పాదాలకు ఎక్కువగా చెమటపట్టకుండా ఉంటుంది.అలాగే పాదాలు పగలకుండా కూడా ఉంటాయి. వీటితో పాటు ఉదయం పూట గడ్డిలో చెప్పులు లేకుండా కూడా నడవాలి. అలాగే బస్త్రిక లాంటి కొన్ని యోగాసనాలు ఖచ్చితంగా మీరు వేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రక్తప్రసరణ అనేది మెరుగుపడి పాదాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.ఇక వీటిని పాటిస్తూనే శరీరంలో వేడి తగ్గేలా నీళ్ళని ఎక్కువగా తాగాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల పాదాల పగుళ్లు తగ్గడంతో పాటు పాదాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: