పల్చగా ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవాలంటే..?

Purushottham Vinay
పల్చగా ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు ఇంకా అలాగే ప్రయోగాలు చేస్తుంటారు.కానీ ఏవి సరిగ్గా ఫలించక ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే అవిసె గింజలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా చాలా ఈజీగా రెండు నెలల్లోనే ఒత్తుగా మారుతుంది.ఎందుకంటే అవిసె గింజల్లో హెయిర్ గ్రోత్ ను డబుల్ చేసే పోషకాలు చాలా మెండుగా ఉంటాయి. ఇక వాటితో పల్చగా వుండే జుట్టు ఒత్తుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ ని పోయాలి. ఇక ఆ వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మరిగించాలి.ఆ తర్వాత గుప్పెడు ఎండిన మందార పువ్వు రేకులని తీసుకొని అందులో వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.


ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆ జెల్ ను సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఈ జెల్ ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇంకా అలాగే అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల దాకా బాగా పట్టించి షవర్ క్యాప్ ని ధరించాలి. ఒక గంట లేదా గంటన్నర తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి అవిసె గింజలతో ఈ రెమెడీని మీరు ట్రై చేస్తే పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా ఇంకా అలాగే పొడుగ్గా పెరుగుతుంది.అంతేగాక  ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు సిల్కీగా ఇంకా షైనీ గా తయారవుతుంది. జుట్టు రాలడం కూడా చాలా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. కాబట్టి పల్చటి జుట్టు తో బాధపడుతున్న వారు తప్పకుండా అవిసె గింజలతో ఈ రెమెడీని పాటించండి. మీ జుట్టుని ఒత్తుగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: