కాళ్ళ పగుళ్ళు, మొటిమలు, పులిపిర్లు తగ్గాలంటే..?

Purushottham Vinay
కాళ్ల పగుళ్ల సమస్య అనేది చాలా మందికి కూడా కామన్ గా ఉంటుంది. ఇక ఈ సమస్యని తగ్గించడంలో  అరటి పండు తొక్క చాలా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు అరటి పండు తొక్కను తీసుకొని దానిని కాలి అడుగు భాగంలో ఉంచి దానిపై నుండి సాక్స్ వేసుకోవాలి. పొద్దున్నే అదే అరటి పండు తొక్కతో కాళ్ల పగుళ్ల మీద బాగా రుద్దాలి.ఆ స్కిన్ మెత్తబడిన తరువాత బ్రష్ తో లేదా స్క్రబర్ తో బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్ల సమస్యలు చాలా త్వరగా తగ్గుతాయి.అలాగే గాయాలు తగిలి రక్తం గడ్డకట్టుకుపోయినప్పుడు ఆ భాగంలో మనకు చాలా నొప్పి కలుగుతుంది. అలాంటి భాగంలో రాత్రి పడుకునే ముందు తగినంత అరటి పండు తొక్కను ఉంచి దానిని మెత్తటి వస్త్రంతో కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నొప్పి తగ్గడంతో పాటు గడ్డకట్టిన రక్తం కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇంకా అలాగే  పులిపిర్లను తొలగించడంలో కూడా  ఈ అరటి పండు తొక్క బాగా ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పులిపిర్లు చాలా ఈజీగా వాటంతట అవే రాలిపోతాయి.


మొటిమల సమస్యను తగ్గించడంలో కూడా అరటి తొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే అరటి తొక్కను తీసుకుని మొటిమలపై సాఫ్ట్ గా రుద్దాలి. తడి ఆరే దాకా అలాగే ఉంచి తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం ఈజీగా మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇంకా అలాగే సొరియాసిస్ తో బాధపడే వారు కూడా చర్మంపై అరటి పండు తొక్కతో సాఫ్ట్ గా రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సొరియాసిస్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా ఉండడంతో పాటు చర్మం కూడా ఎక్కువగా పగలకుండా మృదువుగా ఉంటుంది. ఇంకా అలాగే దోమలు కుట్టినప్పుడు ఆ భాగంలో మంట ఇంకా దురద ఎక్కువగా ఉంటుంది. దోమ కుట్టిన చోట అరటి పండు తొక్కతో రుద్దడం వల్ల మంట ఇంకా అలాగే దురద రెండూ కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ విధంగా అరటి పండు తొక్క బాగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: