బ్లాక్ హెడ్స్ ఉంటే ఇలా చెయ్యండి.. ఈజీగా పోతాయి?

Purushottham Vinay
ఇక మనల్ని బాగా వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో బ్లాక్ హెడ్స్ సమస్య అనేది కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మందే  ఉంటారు. ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా ముక్కుపై వస్తూ ఉంటాయి.అయితే వీటి వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికి చూడడానికి చాలా అందవిహీనంగా కనబడతాయి.ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చర్మం పై ఉండే మలినాలు ఇంకా మృత కణాలు చర్మం పై ఉండే జిడ్డుతో కలిసి అవి బ్లాక్ హెడ్స్ గా మారతాయి. అయితే జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటిని తొలగించడానికి చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్లాక్ హెడ్స్ ను మన వంటింట్లో ఉండే పదార్థాలతో చాలా సులభంగా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ను తొలగించే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో పంచదార మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పంచదారను వేసి అందులో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేయాలి. తరువాత ఈ పంచదారను చేత్తో తీసుకుంటూ బ్లాక్ హెడ్స్ పై ఒక 10 నిమిషాల పాటు అలాగే రుద్దాలి.తరువాత దీనిని వస్త్రంతో తుడిచి బాగా శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసిన తరువాత వేడి నీటితో ముఖానికి బాగా ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి పట్టడం బ్లాక్ హెడ్స్ అనేవి మెత్తబడి వదులవుతాయి. ఇప్పుడు దూదిని తీసుకుని బ్లాక్ హెడ్స్ ను బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఆ భాగంలో మీరు మీగడను లేదా మాయిశ్చరైజర్ ను రాయాలి. 


ఇలా చేయడం వల్ల చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ ను తగ్గించుకోవచ్చు. ఇంకా అలాగే మన వంటగదిలో ఉండే జాజికాయతో కూడా మనం ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.అలాగే ఈ జాజికాయను నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమానికి తేనెను కలిపి బ్లాక్ హెడ్స్ ను ఉన్న చోట  ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.ఇక ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఆ జాజికాయను పొడిగా చేయాలి. ఈ పొడికి పాల మీగడను కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ పై  ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి. ఈ విధంగా జాజికాయను తరచూ వాడటం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంతో పాటు చర్మం మృదువుగా  ఇంకా సున్నితంగా తయారవుతుంది. ఈ టిప్స్ పాటిస్తూనే తరచూ ముఖాన్ని జిడ్డు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: