జుట్టు సమస్యలను ఈజీగా తగ్గించే ఇంటి చిట్కాలు?

Purushottham Vinay
జుట్టు సమస్యలను చాలా ఈజీగా తగ్గించడంలో మనకు మందార పువ్వులు ఇంకా అలాగే మందార ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎంతోకాలం నుండి ఈ మందార పువ్వులను ఇంకా అలాగే వాటి ఆకులను మనం జుట్టు సంరక్షణలో వాడుతూ ఉన్నాం. మందారలో ఉండే ఔషధ గుణాలు జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం కొబ్బరి నూనెను కూడా వాడాల్సి ఉంటుంది.అయితే దీని కోసం ముందుగా 5 లేదా 6 మందార ఆకులను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత 5 ఒంటి రెక్క మందారాలను తీసుకుని వాటి రేకులను సేకరించాలి. ఇంకా ఇప్పుడు ఒక జార్ లో లేదా రోట్లో ఈ మందార ఆకులను ఇంకా అలాగే మందార పువ్వుల రేకులను వేసి వాటిని మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొబ్బరి నూనెను కూడా తీసుకుని వేడి చేయాలి. ఇక ఆ నూనె వేడయ్యాక అందులో మందార ఆకుల మిశ్రమాన్ని వేసి కలపాలి.


ఈ నూనెను మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు అలాగే వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఈ నూనె చల్లారిన తరువాత దానిని వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివర్ల దాకా బాగా పట్టించాలి.ఇక ఆ తరువాత నూనె చర్మంలోకి బాగా ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా జుట్టుకు నూనె రాసుకుని ఒక గంట దాకా అలాగే ఉండాలి. ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు కుదుళ్లు అనేవి చాలా బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడిబారడం, జుట్టు తెగడం ఇంకా అలాగే చిట్లడం వంటి సమస్యలు కూడా చాలా సులభంగా తగ్గుతాయి. ఇంకా అలాగే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ టిప్స్ పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: