మంగు మచ్చలను తగ్గించే ఇంటి చిట్కాలు?

Purushottham Vinay
ఎండకు బాగా తిరగడం, హార్మోన్ల అసమతుల్యత ఇంకా అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వాడే మందుల కారణంగా అలాగే రసాయనాలు ఎక్కువగా ఉండే కాస్మోటిక్స్ ను వాడడం వల్ల, ఇంకా అలాగే పొడి చర్మం ఉన్న వారిలో ముఖం పై ఈ మంగు మచ్చలు వస్తాయి. ఇంకా అలాగే గర్భిణీ స్త్రీలల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే వారిలో ఈ సమస్య కొద్ది రోజుల పాటు ఉండి తరువాత ఆ మచ్చలనేవి తొలగిపోతాయి. ఈ మచ్చల సమస్య ముక్కుపై, నుదుటి మీద ఇంకా అలాగే బుగ్గలపై ఎక్కువగా వస్తూ ఉంటుంది.అయితే ఈ మచ్చల వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి చాలా అందవిహీనంగా ఉంటాయి. ఈ మంగు మచ్చలను ఇంటి చిట్కాలతో ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. మంగు మచ్చలతో బాధపడే వారు ఈ టిప్స్ వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మంగు మచ్చలను తగ్గించడంలో మనకు బంగాళాదుంప మనకు చాలా బాగా ఉపయోపడుతుంది. అడ్డంగా తరిగిన బంగాళాదుంప ముక్కను తీసుకుని దానిని మంగు మచ్చలపై 15 నుండి 20 పాటు రాస్తూ బాగా మర్దనా చేయాలి.


ఆ తరువాత మరో పది నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల మర్దనా చేసిన చోట రక్తప్రసరణ అనేది బాగా చురుకుగా జరుగుతుంది. దీంతో ఆ మచ్చలు ఈజీగా తగ్గి ఆ ప్రదేశంలో చర్మం సాధారణ స్థితికి వస్తుంది.ఇంకా అలాగే కలబంద గుజ్జును ఉపయోగించి కూడా మనం మంగు మచ్చలను చాలా ఈజీగా నివారించుకోవచ్చు. ఇక కలబంద గుజ్జును తీసుకుని మంగు మచ్చలపై రాస్తూ బాగా మర్దనా చేయాలి. ఇలా రాసిన తరువాత ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంగు మచ్చల నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు. ఇంకా అలాగే అదే విధంగా నిమ్మకాయ ముక్కను తీసుకుని మంగు మచ్చలపై ఒక 15 నిమిషాల పాటు రాస్తూ ఉండాలి. తరువాత నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా  మంగు మచ్చలు ఈజీగా తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల అసలు ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మనం చాలా ఈజీగా మంగు మచ్చలను తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: