తెల్ల జుట్టు నల్లగా మారే అద్భుత చిట్కాలు?

Purushottham Vinay
నెరిసిపోయిన తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు గోరింటాకు మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. గోరింటాకుల పొడిలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ, తులసి రసం ఇంకా అలాగే పుదీనా రసం వేసి బాగా కలపాలి.అలాగే ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలి. రాత్రంతా కూడా దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పూట ఈ మిశ్రమాన్ని మీ తలకు రాసుకోవాలి. ఒక మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో రెండు సార్లు చేయాలి. దీంతో మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది. చుండ్రు సమస్య అస్సలు ఉండదు. జుట్టు దృఢంగా మారి పొడవుగా పెరుగుతాయి.జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరికాయ ఇంకా అలాగే కొబ్బరినూనె మిశ్రమం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఉసిరికాయలలోని గింజలను తీసేసి ఎండబెట్టాలి. ఆ ఎండిన ఉసిరికాయలు కొన్ని తీసుకుని పొడి చేయాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని పావు కప్పు కొబ్బరినూనెలో వేసి  వేడి చేయాలి.


కొంచెం వేడి చేశాక దాన్ని రాత్రంతా కూడా అలాగే వదిలేయాలి. ఇక మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ తరువాత వచ్చే నూనెను సేకరించి మీ జుట్టుకు బాగా రాయాలి. ఇలా రాసిన తరువాత ఒక అర గంటపాటు ఉంచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇక దీన్ని కూడా వారంలో మూడు సార్లు చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది.అలాగే జుట్టును నల్లగా మార్చడంలో బ్లాక్ టీ బాగా పనిచేస్తుంది. పాలు కలపకుండా తయారు చేసిన బ్లాక్ టీ కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక కప్పు టీకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మీ తలకు బాగా పట్టించాలి.అది బాగా జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. ఆ తరువాత అర గంట పాటు ఉండి తలస్నానం చేయాలి. ఇలా ఖచ్చితంగా వారంలో కనీసం 3 సార్లు చేయాలి. దీంతో మీకు తప్పక మంచి ఫలితం కనిపిస్తుంది. తెల్ల జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది. దీని వల్ల ఇతర జుట్టు సమస్యలు కూడా రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: