ఇలా చేస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు?

Purushottham Vinay
మొటిమల సమస్య అనేది యూత్ ని ఎంతగానో బాధ పెడుతుంది.కొంతమందికి టీనేజ్ లో స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ దాకా ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ కు తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. అదే విధంగా సాయంత్రం ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లేదా బత్తాయి జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల  మొటిమలు ఇంకా అలాగే వాటి వల్ల వచ్చే మచ్చలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అదే విధంగా మొటిమలను ఎప్పుడూ కూడా అస్సలు గిళ్ల కూడదు. ఒత్తకూడదు. ఇంకా అలాగే ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు వాటిపై గట్టిగా రుద్దకూడదు. కాటన్ క్లాత్ లేదా దూదితో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు ఫ్యూచర్ లో కూడా ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.నల్లటి మట్టిని తీసుకొని ఈ మట్టిని ఉండలు లేకుండా నలగొట్టి బాగా జల్లించాలి. ఇలా జల్లించగా వచ్చిన మెత్తటి మట్టికి నీటిని కలిపి 4 గంటల పాటు అలాగే నానబెట్టాలి.


ఇలా తయారు చేసుకున్న మట్టికి కొద్దిగా పసుపును కలిపి ముఖానికి మంచి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఈ మట్టి ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముఖ చర్మానికి రక్తప్రసరణ అనేది బాగా జరిగి ముఖం పై ఉండే మచ్చలు ఇంకా మొటిమలు చాలా ఈజీగా తగ్గుతాయి.మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడే వారు రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఖచ్చితంగా రోజుకి రెండు సార్లు మల విసర్జనకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు, హానికర పదార్థాలు ఇంకా అలాగే మనం తీసుకునే జంక్ ఫుడ్ లో ఉండే రసాయనాలు చాలా ఈజీగా బయటకు వెళ్లిపోతాయి. రోజూ కూడా నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవడంతో పాటు మొటిమలకు కారణమయ్యే వ్యర్థాలు అన్నీ కూడా చాలా ఈజీగా తొలిగిపోతాయి. ఇంకా అలాగే ముఖానికి కొబ్బరి నూనెను కానీ పాల మీద మీగడను కానీ రాయాలి. ఇలా రాసిన తరువాత ఫేషియల్ స్టీమర్ తో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలకు కారణమయ్యే వ్యర్థ పదార్థాలు చర్మ రంధ్రాల నుండి చెమల రూపంలో ఈజీగా బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: