జుట్టు రాలే సమస్యను 15 రోజుల్లో తగ్గించే టిప్?

Purushottham Vinay
జుట్టు రాలే సమస్యను ప్రస్తుత కాలంలో మనలో చాలామంది కూడా చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ కూడా చాలా ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు.అయితే కారణాలేవైనప్పటికి కూడా జుట్టు రాలే సమస్య మాత్రం మనకు మరింత మానసిక ఆందోళనను ఎక్కువగా కలిగిస్తుంది. అయితే ఈ సమస్యకి ఇంటి చిట్కాను ఉపయోగించి మనం ఈ జుట్టు రాలడాన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ చిన్నదే అయినప్పటికి ప్రభావవంతంగా పని చేస్తుంది.ఇక ఈ జుట్టు రాలడాన్ని తగ్గించే ఇంటి చిట్కాను  ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా అలాగే దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అనే వివరాలను పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల 15 రోజుల్లోనే మనం ఫలితం పొందవచ్చు. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి మనం అల్లం రసాన్ని, కలబంద గుజ్జును ఇంకా అలాగే కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.


అల్లం అనేది మన జుట్టు పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె జుట్టు పొడిబారడాన్ని తగ్గించి జుట్టు కుదుళ్లను బాగా బలంగా చేస్తుంది. అందువల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో జుట్టు పొడవును బట్టి 5 నుండి 10 టీ స్పూన్ల అల్లం రసాన్ని మీరు తీసుకోవాలి. ఆ తరువాత అందులో 3 టీ స్పూన్ల కలబంద గుజ్జును ఇంకా అలాగే 3 టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు కూడా బాగా పట్టించాలి.ఆ తరువాత ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ ఫ్యాక్ ను వేసుకున్న ఒక 2 గంటల తరువాత మనం తరచూ ఉపయోగించే షాంపును వాడి బాగా తలస్నానం చేయాలి. ఇక వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా ఈజీగా తగ్గి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: