పురుషులను హ్యాండ్సమ్ గా మార్చే సూపర్ టిప్స్?

Purushottham Vinay
పురుషులను హ్యాండ్సమ్ గా మార్చే సూపర్ టిప్స్?


అందంగా మారాలనుకునే పురుషులు రోజుకు కనీసం మూడు నుండి నాలుగు సార్లు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉండే ఫేస్ వాష్ ను మాత్రమే వాడాలి. అలాగే షేవింగ్ చేసుకున్న ప్రతిసారి అలొవెరా జెల్ ను చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే పురుషులు గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.గుమ్మడి కాయ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిని రోజూ వారి ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనబడుతుంది.దీన్ని తీసుకోవడం వల్ల పురుషులు అందంగా, యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటారు.ఇంకా అలాగే బీట్ రూట్ రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల కూడా పురుషులు అందం మరింత పెరుగుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో బీట్ రూట్ ఎంతగానో సహాయపడుతుంది. 


బీట్ రూట్ లో నైట్రేట్ అధికంగా ఉంటుంది. బీట్ రూట్ ను తినప్పుడు ఇందులో ఉండే నైట్రేట్ నోట్లో బ్యాక్టీరియాతో కలిసి నైట్రేట్స్ గా మారి మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. అందువల్ల బీట్ రూట్ ను రోజూ తినడం వల్ల ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే పురుషుల అందానికి, ఆరోగ్యానికి టమాటాలు కూడా ఎంతగానో దోహదపడతాయి. టమాటాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది. రోజూ టమాటాను డైట్ లో భాగంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. పురుషులు తీసుకోవాల్సిన ఆహారాల్లో పాలకూర ఒకటి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉన్నవారు పాలకూరను వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవాలి. పాలకూరలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. దీనిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ పురుషుల అందాన్ని ఇంకా అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: