యవ్వనంగా కనబడాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
యవ్వనంగా కనబడాలంటే ఇవి తినండి?

రసాయనాలు అనేవి దీర్ఘకాలంపాటు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. ఐతే రకరకాల ట్రీట్‌మెంట్లు, సౌందర్య ఉత్పత్తులకు బదులుగా సహజంగా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంతోపాటు, చర్మానికి సహాజకాంతిని అందించే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే కాబట్టి ఖచ్చితంగా ఇవి తినండి.సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.బొప్పాయిలో పాస్పరస్‌, బీ విటమిన్‌, పొటాషియంతోపాటు ఇతర పోషకాలు ఎన్నో ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మంపై ఏర్పడే గీతలు, ముడతలను నివారిస్తుంది.వీటితోపాటు ఇతర డ్రైఫ్రూట్స్‌, పాలకూర, బ్రొకోలి, అవకాడో, స్వీట్‌ పొటాటో, దానిమ్మ గింజలు వంటి పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే నిత్య యవ్వనం మీ సొంతం.సత్వర శక్తిని అందించే వాటిల్లో ఖర్జూర పండ్లు ముఖ్యమైనది. ఇవి రోజూ తినటం వల్ల రక్తం ప్రసరణ పెరగడంతోపాటు, ఉత్సాహంగా ఉంటారు.వాల్‌నట్స్‌లో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్‌, విటమిన్‌ ఎ, సీ,కే, బీ-1, బీ-2 పుష్కలంటా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపల్నుంచి పోషిస్తాయి.


శరీరానికి కావాల్సిన మినరల్స్‌, అమైనో ఆమ్లాలు, ఫైబర్‌ జీడిపప్పులో పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు జీడిపప్పు తిన్నారంటే చర్మకాంతి ఇమనుమడిస్తుంది. జీడిపప్పుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. రుచికి కూడా బాగుంటుంది.పిస్తాల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు చర్మంపై ముడుతలు రాకుండా నివారిస్తాయి.ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బాదం పప్పు ఒకటి. వీటిల్లో ఉండే విటమిన్‌ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పలుకులు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్‌ తీసుకోవచ్చు.ఆరోగ్యంతోపాటు, చర్మానికి సహాజకాంతిని అందించే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే కాబట్టి ఖచ్చితంగా ఇవి తినండి.సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. అందంగా ఉండండి.యవ్వనంగా కనబడాలంటే ఇవి తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: