చుండ్రు, జుట్టు రాలడం తగ్గించే సూపర్ టిప్?

Purushottham Vinay
చాలా మంది కూడా చుండ్రు సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే ఒక రాగాన వదలదు. వర్షాకాలంలో అయితే మరింత ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. చుండ్రు సమస్య రాగానే మనలో చాలామంది కూడా మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.పొయ్యి మీద పాన్ పెట్టి మూడు స్పూన్ల ఆవాలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి.కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి తురమాలి. ఈ తురుము నుండి రసాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో ఆవాల పొడి, ఉల్లిపాయ రసం, ఒక గుడ్డు తెల్ల సోన, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.


చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటే ఈ రెమెడీని వారంలో రెండుసార్లు ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది.ఆవాలు నేచురల్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలకుండా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఆవాలులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును వదిలించుకోవడంలో కూడా బాగా సహాయపడుతుంది. స్కాల్ప్ ఇంకా జుట్టు సమస్యలను తగ్గించుకోవటానికి ఆవాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఉల్లిపాయ రసంలో యాంటీమైక్రోబయల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ చిట్కాను ఫాలో అయితే చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన విధంగా ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: