గుమ్మడికాయతో ఇలా చేస్తే అదిరిపోయే అందం ఖాయం!

Purushottham Vinay
గుమ్మడి కాయలో ఉండే పోషకాలు చర్మానికి అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్  ను కలుగజేస్తాయి. ఇలా ఇంటిలోనే సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేసుకునే గుమ్మడికాయ ఫేషియల్స్ మీ చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ గుమ్మడికాయలో ఆల్ఫా, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను  తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. గుమ్మడికాయతో చేసుకునే ఫేషియల్స్ ను ఉపయోగిస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. దీంతో మీ చర్మం శుభ్రపడుతుంది. అలాగే సన్ టాన్ వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.గుమ్మడితో చేసుకునే ఫేషియల్స్ చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా సహాయపడి అలాగే చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారే సమస్యల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది.అలాగే మొటిమలు, మచ్చలు ఇంకా అలాగే నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.


కనుక గుమ్మడి ఫేషియల్స్ ను చర్మ సౌందర్యం  కోసం మీరు ఉపయోగించండి.. మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి.ఇక గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుమ్మడి మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకుని ఒక పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం బాగా శుభ్రపడి మీ చర్మ కాంతి అనేది బాగా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా గుమ్మడి గుజ్జు , పాలు , తేనె ఇంకా గుడ్డు తెల్లసొన  వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం ఇంకా అలాగే మెడకు బాగా అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల తరువాత నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖంపై ఏర్పడ్డ మొటిమలు ఇంకా అలాగే మచ్చలు చాలా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: