అందమైన జుట్టు కావాలి అంటే గుమ్మడి గింజలతో ఇలా చేయండి..!!

Divya
గుమ్మడి గింజల ఆరోగ్యానికే కాదు మన తల మీద ఉండే వెంట్రుకలు కూడా పెరగడానికి మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా లభిస్తాయి.. ఇది అనేక జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. జుట్టు పల్చబడటం చుండ్రు, జుట్టు పగిలిన, రాలిపోతున్న కూడా నివారిస్తుంది.ఈ గుమ్మడి గింజలను మనము అనేక విధాలుగా తినవచ్చు. నీళ్ళల్లో నానబెట్టి.. వాటిని సలాడ్ లలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గుమ్మడికాయ గింజలు ప్రయోజనాలు తెలుసుకుందాం.

1).గుమ్మడి గింజలు జుట్టు పెరిగేలా చేస్తాయి ఇది జుట్టును చాలా బలంగా ఉండేలా కూడా చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో తో పాటుగా జుట్టును నిగనిగలాడేలా కూడా చేస్తూ ఉంటుంది. వీటిని ప్రతి రోజూ మనం డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టుకు అధిక పోషణ లభిస్తుంది.
2). కొన్నిసార్లు చుండ్రు వదిలించుకోవడం చాలా కష్టం గా మారుతూ ఉంటుంది. చుండ్రు సమస్య వల్ల జుట్టు చాలా బలహీనంగా అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా గుమ్మడికాయ విత్తనాలను ఉపయోగించుకొని పేస్టులాగా చేసుకొని వాటిలో కి నిమ్మరసం కలిపి తలకు పట్టించుకుని 20 నిమిషాల పాటు ఆరిన తరువాత నీటితో స్నానం చేస్తే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దురద మంట సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
3). జుట్టు చిట్లడం వల్ల రాలడం మొదలవుతుంది.. ఈ పరిస్థితుల్లో జుట్టు చాలా బలహీనంగా మారుతూ ఉంటుంది మృదువైన జుట్టు కోసం గుమ్మడికాయ గింజలు ఉపయోగించుకోవచ్చు.. దీనికోసం గుమ్మడికాయ గింజలను పేస్ట్ గా చేసి అందులో కాస్త పెరుగు, తేనె కలిపి జుట్టుకి పట్టించుకోవాలి.. ఆ తర్వాత ఒక అర్థగంట సేపు ఉంచి తలస్నానం చేస్తే శిరోజాలు దీంతో జుట్టు చాలా బలంగా మారుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: